Homeహైదరాబాద్latest News‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి.. అసలు ఏం జరిగిందంటే..?

‘పబ్జీ’ ప్రియుడి కోసం.. యూపీకి అమెరికా యువతి.. అసలు ఏం జరిగిందంటే..?

ఆ మధ్య పబ్జీ ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ తరహాలోనే ఇప్పుడు మరో ప్రేమకథ చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ అమ్మాయికి భారత్‌కు చెందిన యువకుడితో పబ్‌జీ ద్వారా పరిచయం ఏర్పడింది.. అది ప్రేమగా మారింది. దాంతో.. అతని కోసం 12 వేల కిలోమీటర్లు దాటుకొని వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్(30)కు, ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన హిమాన్షుతో పబ్జీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్లక్రితం చండీగఢ్‌లో కలుసుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెను ఇటావాకు తీసుకురాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి అంగీకారంతోనే పెళ్లి జరిగినట్లు తేల్చారు.

Recent

- Advertisment -spot_img