ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి ప్రాణాలను కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శ్వేతా దీపక్ సుర్వేజ్(23) అనే యువతి తన ఫ్రెండ్ సూర్ సంజూ మూలేతో కలిసి ఔరంగాబాద్ వద్ద ఉన్న సులీబంజన్ హిల్స్‌పై కారు నేర్చుకునేందుకు వెళ్లింది. అక్కడ కారును రివర్స్ తీయడం నేర్చుకుంటున్న ఆమె.. నేరుగా వెళ్లి లోయలో పడింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడిక్కడే మృతి చెందింది.