Homeహైదరాబాద్latest Newsధర్మపురిలో ప్రైవేట్ పాఠశాలల దందా.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కి వినతి

ధర్మపురిలో ప్రైవేట్ పాఠశాలల దందా.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కి వినతి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ మరియు మండల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రైవేటు స్కూల్ యజమాన్యం విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ స్కూల్ యూనిఫామ్, షూస్, నోటుబుక్స్ లాంటివి బయటకంటే అధిక రేట్లతో అమ్ముకుంటూ విద్యార్థులపై అధిక ఆర్థిక బారం వేస్తున్నారు. హైదరాబాద్ ఏరియలో స్కూల్ ల్లో ఎటువంటి నోట్ బుక్ యూనిఫామ్, షూస్ లాంటివి స్కూల్ లో విక్రయించవద్దు అని ఏవిధంగా జీవో తీసుకొచ్చారో అలాంటి జీవో కూడా మన ధర్మాపురి పట్టణ మండల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కూడా అలాగే జీవో వర్తింప చేస్తూ.. విద్యార్థులకు సరైన న్యాయం చేయగలరని భారతీయ జనత యువ మోర్చా గాజు భాస్కర్ ఆద్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల విద్యార్థుల కుటుంబ పరిస్థితులను ఆలోచించి ఏవైతే ప్రైవేట్ స్కూల్ యజమాన్యం అధిక ఫీజులు తోపాటు స్కూల్లో విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్ షూస్ స్కూల్ డ్రెస్ అలాంటివి ఏవైతే ఉన్నాయో బయట కంటే అధిక రేట్లు వసూల్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యజమాన్యానికి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకోలేని ఎడల భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విద్యార్థి ఉద్యమం చేయవలసి వస్తుంది అని తెలియచేస్తూ. విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్య కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లావన్, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్ , జిల్లా ఓబీసీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శంకర్, పిల్లర్ల సురేందర్, బీజేవైఎం ఉపాధ్యక్షులు సంగీమాధవ్,బాకీ అనిల్ , పట్టణ ప్రధాన కార్యదర్శి బండారి సత్యనారాయణ, వెలగందుల ప్రణీత్ , కశేట్టి శివ సాయి ,రాజు ,సికిందర్,అయ్యేరీ మల్లేష్ ,సంఘీ రాజేష్, బిజెపి బీజేవైఎం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img