హైదరాబాద్‌లో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్‌లకు ముఠా పాల్పటంతో పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్‌లు చేస్తున్నారు. జవహర్‌నగర్, శామీర్‌పేట, మోహిదీపట్నంలో చైన్ స్నాచింగ్ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.