Homeహైదరాబాద్latest Newsకాళేశ్వరం ఎస్సై భవాని సేన్ వ్యవహారంపై స్పందించిన పుట్ట మధుపై ఘాటు విమర్శలు చేసిన రామగిరి...

కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ వ్యవహారంపై స్పందించిన పుట్ట మధుపై ఘాటు విమర్శలు చేసిన రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్

ఇదే నిజం రామగిరి: ప్రతిపక్షం విమర్శించడానికి వీలు లేకుండా మంథనిలో ప్రజాపాలన నడుస్తుంది.దీన్ని చూసి తట్టుకోలేక పుట్ట మధుకు మతి భ్రమించింది.దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా బిఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు వ్యవహార శైలి ఉందని రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ విమర్శించారు.ఈ మేరకు వారు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్రమైన విచారణ జరిపి ఆయనను విధుల్లో నుంచి పూర్తిగా తొలగించడం జరిగిందని చెప్పారు.గతంలో రెబ్బెనలో ఎస్సైగా విధులు నిర్వహించిన భవాని సేన్ అక్కడ లైంగిక ఆరోపణలు ఎదుర్కొనగా సదరు వ్యక్తిని పుట్ట మధు గత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మహాదేవ్ పూర్ టూ టౌన్ ఎస్సైగా నియామకం చేయించిన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిపైనా,శ్రీనుబాబు పైనా,కాంగ్రెస్ ప్రభుత్వంపైనా లేనిపోని అవాకులు,చవాకులు పేలుతూ ప్రజల ముందు మరోసారి అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు.

ప్రతి విషయాన్ని మంత్రి కుటుంబానికి ఆపాదిస్తూ రాజకీయం చేయడం పుట్ట మధుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు లేని హత్యల సంస్కృతిని మంథనిలో పెంచి పోషించిన పుట్ట మధుకర్ నీతి వ్యాఖ్యలు వల్లించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. కక్ష్యా రాజకీయాలకు తావులేకుండా మంథని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రామలక్ష్మణులు లాగా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు,శ్రీనుబాబు ముందుకు వెళ్తుంటే.,వారిని విమర్శించడం అంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత బిఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు అరాచక పాలన నడిస్తే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోకకోలా వంటి కంపెనీతో మాట్లాడి మంథని ప్రాంతంలో ఆ కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకుని మంథని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని,దీన్ని చూసి ఓర్వలేకనే పుట్ట మధు ఈవిధంగా దిగజారుడు ఆరోపణలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకొని మంథని ప్రాంత అభిృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img