Homeహైదరాబాద్latest Newsబెల్లంపల్లిలో మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

బెల్లంపల్లిలో మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఇదే నిజం జూన్ 20 బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ గా పదవి భాద్యతలు చేపట్టిన దీపక్ కుమార్ బెల్లంపల్లి పట్టణంలో గురువారం పర్యటించారు. మొదట బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులతో చర్చించారు. ఆ తరువాత పట్టణంలోని కాంటా చౌరస్తాలోని మార్కెట్ కాంప్లెక్స్ భవనాన్ని ఛైర్ పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు. వ్యాపారస్తుల సౌకర్యార్థం త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత శ్రీధర్ ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img