Homeహైదరాబాద్latest Newsదేశంలో హోం మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ .. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్...

దేశంలో హోం మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ .. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాప్రయత్నాలు అంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఎక్కడికి పోయారు పోలీసులు? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నేడు తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ … దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ. ముఖ్యమంత్రి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ మరియు రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంతో బ్రతికెలాగ చేస్తున్నాడు. పోలీసులు దేంట్లో బిజీ ఉన్నారు అంటే రేవతి అనే ఒక జర్నలిస్ట్ కరెంటు లేదని ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టారు. 505 సెక్షన్ అనేది ప్రజల మీద భయాందోళనలు సృష్టించి, విద్వేషం రగిలించి, ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకోడానికి ప్రేరేపిస్తే అప్పుడు ఆ సెక్షన్ పెట్టాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అదేశాలు ఏంటి అంటే ప్రశ్నించే వాళ్లు జర్నలిస్టులైన సరే, గృహిణులు అయినా, విద్యార్థులు అయినా సరే కేసులు పెట్టండని పోలీసులకు చెప్పాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Recent

- Advertisment -spot_img