Homeహైదరాబాద్latest Newsఅంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఇది నిజం ,ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు అంతర్జాతీయ సంగీత దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక శ్రీవాణి విద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ధర్మపురికి చెందిన స్థానిక గాత్ర విద్య సంస్థలు కొరిడే నరహరి శర్మ , శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డోలు విధ్వాన్సులు తంబత్క సురేష్ మరియు స్థానిక యోగసాధకులు గొల్లపల్లి సుమలత పాల్గొని సంగీతము, యోగ ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ యోగాసనాలు వేసి పిల్లలకు అవగాహన కల్పించారు. వీరిని పాఠశాల యాజమాన్యం సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గట్ల శ్రీనివాస్ ప్రిన్సిపల్ సంగనభట్ల సంతోషి డైరెక్టర్ సంగనభట్ల దినేష్ తోట శంకర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img