Homeహైదరాబాద్latest Newsమిషన్ భగీరథ వాటర్ ట్యాంకు భూమి పూజ : కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్

మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు భూమి పూజ : కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్

ఇది నిజం కోహెడ: కోహెడ మండలం శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎంపీపీ కీర్తి సురేష్ భూమి పూజ చేశారు 60 వేల లీటర్ల సామర్థ్యంతో 30 లక్షల రూపాయలతో అదనపు ట్యాంకు నిర్మాణం కోసం రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకరించినందుకు మంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ కీర్తి సురేష్ మాట్లాడుతూ గ్రామంలో గ్రామ ప్రజలకు నీటి అవసరాల దృశ్య మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడగడంతోనే అదనపు వాటర్ ట్యాంక్ ను మంజూరు చేశారని శనిగరం గ్రామంలోని ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు.అనంతరం గ్రామంలోని సబ్ సెంటర్ ను సందర్శించారు సబ్ సెంటర్ వారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు గర్భిణీ స్త్రీలకు ప్రసవించిన బాలింతలకు మంచి పోషకాహారం అందించాలని పోషకాహారం ద్వారా పుట్టబోయే బిడ్డ తల్లి ఇద్దరు బలంగా ఉంటారని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ కొంపెల్లి స్వప్న శశిధర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కర్ర శ్రీహరి, మాజీ సర్పంచ్ లు కర్ర రవీందర్, గాదె శ్రీధర్, మిషిన్ భగీరథ డి ఈ రుహిన, ఎ యి ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి చంద్రం, ఎండీ రహిం, కర్ర భిక్షపతి,ప్రతాపరెడ్డి,అనిల్, తిరుపతి, రంగారెడ్డి,రాజమహ్మద్, రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img