Homeహైదరాబాద్latest Newsహరీష్ రావు నీ రాజీనామా రెడీ చేసుకో : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హరీష్ రావు నీ రాజీనామా రెడీ చేసుకో : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదేనిజం జగిత్యాల : రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో గతంలో చెప్పినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. జిల్లా కేం డ్రంలోని ఇందిరా భవన్ లో ప్రభుత్వ విప్, ధర్మ పురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారన్నారు. ప్రకృతి వైప రీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా సష్ట పరిహారం అందిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పంటల బీమా ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వరి మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో కనుమరుగైన బీఆర్ఎస్ పార్టీ గురించి తాము ఆలోచన చేయబోమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉందని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img