Homeహైదరాబాద్latest Newsజస్‌ప్రీత్ బుమ్రా గురించి ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ ఏమన్నాడంటే?

జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ ఏమన్నాడంటే?

సూపర్‌-8 పోరులో భాగంగా నేడు ఆసీస్‌తో భారత్ తలపడనుంది.కంగారులకు చావోరేవో లాంటి మ్యాచ్‌లో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కంగారూల జట్టును అడ్డుకోవడంలో జస్‌ప్రీత్ బుమ్రా ఓవర్లే కీలకంగా మారతాయని భారత మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా వ్యాఖ్యానించాడు. బుమ్రాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కాలింగ్‌వుడ్‌ ప్రశంసలు కురిపించాడు.ఈసారి ప్రపంచకప్‌లో ఇతర జట్లకు, భారత్‌కు బుమ్రానే వ్యత్యాసం. ప్రతీ టీమ్‌లోనూ ఇలాంటి ఆటగాడు ఉండాలని కోరుకోవడం సహజం. వికెట్లను తీయడంతోపాటు ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆసీస్‌పైనా బుమ్రా వేసే నాలుగు ఓవర్లే అత్యంత కీలకం కానున్నాయి. అతడిని గౌరవిస్తేనే ఆసీస్‌కు ఏమైనా అవకాశం ఉంటుంది అని కాలింగ్‌వుడ్‌ తెలిపాడు.

Recent

- Advertisment -spot_img