సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి ఆమె భర్తని సీబీఐ అరెస్టు చేసిందని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆమె వీడియో కాల్ కట్ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడింది. అనంతరం భర్తతో కలిసి సైబర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.