Homeజిల్లా వార్తలువివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ

వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి డిండి చౌరస్తా వరకు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని డి.ఎస్.పి గిరిబాబు , దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టి , ఎమ్మార్వో సంతోష్ కుమార్, సీఐనరసింహ, అందరితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
అనంతరం ర్యాలీగా డిండి చౌరస్తా వరకు శ్లోకాలతో నడుచుకుంటూ వెళ్లి, అక్కడ డి.ఎస్.పి గిరిబాబు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిస కావడం ఎంతో దురదృష్టకరమని, ముఖ్యంగా అతి చిన్న వయసులోనే ఇలాంటి మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడటం అనేది దురదృష్టకరమని, దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని, తాము కొన్ని స్పెషల్ బృందాలను తయారు చేసి ప్రతి కాలేజీకి, స్కూలుకు వెళ్లి మాదకద్రవ్యాల పైన అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ యొక్క అవగాహన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రమేష్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ సైదులు, మరియు సిబ్బంది, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, కరుణాకర్, తాళ్ల సురేష్, బైట్ కంప్యూటర్ మొహమ్మద్, పగిడిమర్రి శ్రీనివాస్ ,వంగూరు వెంకటేశ్వర్లు, వెంకటేష్ ,కరాటే మాస్టర్ శ్రీను, డాన్స్ మాస్టర్ జగన్, సన్నీ ,సవేర్ ,సాయి, అన్వర్, పీఈటీలు జె చంద్రయ్య ,నాగరాజు ,రజిత, రామ్ చందర్, మురళి, రవి, వివిధ పాఠశాలల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వివిధ అధికారులు, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, కళాకారులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img