రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా రేవంత్ సర్కార్ కీలక మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది రేవంత్ సర్కార్. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామని పూర్తి పారదర్శకంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.