Homeజిల్లా వార్తలుహరిమూర్తి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్ళు

హరిమూర్తి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్ళు

ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలోని హరిమూర్తి పెట్రోల్ బంక్ లో గురువారం ఉదయం పెట్రోల్ పోయియించుకున్న వినియోగదారులకు పెట్రోల్ కు బదులుగా నీళ్లు రావడంతో అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దాంతో బంక్ యాజమాన్యం బంక్ ను మూసేసి ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు నష్టపరిహారం అందజేశారు. నిజామాబాద్ కంపెనీ నుండి సేల్స్, టెక్నికల్ ఆఫీసర్స్ వచ్చి శాంపిల్స్ సేకరించారు. వర్షకాలం అయినందున ఎక్కడైనా లీకేజీ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

కస్టమర్లను ఇబ్బంది పెట్టొద్దు: మల్లేష్, వెలగనూరు, దండేపల్లి మండలం
బంక్ సిబ్బంది ఎప్పటికప్పుడు పెట్రోల్ చెక్ చేసుకోవాలి. కస్టమర్ల ఇబ్బంది పడకుండా చూడాలి. పెట్రల్ కు బదులు నీళ్లు నింపడంతో రోజంతా పనితో పాటు సమయం వృధా అవుతుంది. బంక్ యాజమాన్యం ఇలా చేయడం సరికాదు.

విచారణ చేస్తున్నాం: హెచ్ పీ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ రాజకుమార్
పెట్రోల్ ట్యాంక్ లో వాటర్ ఎక్కడి నుండి వచ్చిందనేది టెక్నికల్ ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించాం. వాటర్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తాం.

Recent

- Advertisment -spot_img