Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: సామాన్యులకు శుభవార్త.. వాటి ధరలు భారీగా పడిపోయాయి..!

GOOD NEWS: సామాన్యులకు శుభవార్త.. వాటి ధరలు భారీగా పడిపోయాయి..!

సామాన్యులకు అదిరిపోయే శుభవార్త. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి గత కొన్ని రోజులుగా భయపెడుతూ వచ్చిన టమోటా ధరలు ఇప్పుడు భారీగా దిగి వచ్చాయి. సామాన్యులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా సామాన్యులు టమోటా కొందమంటేనే భయపడుతున్నారు. ధరలు ఆ స్థాయిలో పెరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఏకంగా సగానికి దిగి వచ్చాయి. హోల్ సేల్‌ మార్కెట్‌లో అయితే టమోటా ధరలు రూ.40కు కూడా పడిపోయాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో టమోటా ధరలు కేజీకి రూ. 50 వద్ద ఉన్నాయి. ప్రాంతం ప్రాదిపతికన ధరల్లో కాస్త వ్యత్యాసం ఉండొచ్చు. రెండు వారాల కిందట టమోటా ధరలు ఏకంగా శతకం కొట్టాయి. రేట్లు సెంచరీ దాటేశాయి. అయితే ఇప్పుడు చూస్తే ధరలు సగానికి దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img