Homeజిల్లా వార్తలుప్రజావాణి ధరణిల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్

ప్రజావాణి ధరణిల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ చింతపల్లి మండలం ప్రజావాణి, ధరణిల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చింతపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి దరఖాస్తుల పరిష్కారంతోపాటు, ప్రజావాణి పిటిషన్ల పరిష్కారాన్ని పరిశీలించారు. ధరణి దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వారంలోగా పరిష్కరించాలని, సమయం ఎక్కువ తీసుకోవాల్సి వస్తే 15 రోజులుగా తప్పనిసరిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం చేయాలన్నారు. ధరణి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారుల భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని, అవసరమైతే సర్వేయర్ తో కొలిపించి అద్దులు నటించాలని సూచించారు. చెరువు కుంటలు శిఖం భూములు ఆక్రమణకు గురైనట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించి వెంటనే అద్దులు నాటించాలని సూచించారు. ప్రతివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అందిన ఫిర్యాదులపై రివ్యూ నిర్వహించబడుతుందన్నారు. వీరి వెంట ఏడి శ్రీనివాస్ చింతపల్లి తహసీల్దార్ విజయ్ కుమార్ డిప్యూటీ తాసిల్దార్ హర్షద్ ఆర్ఐ యాదయ్య సర్వే రతన్లాల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img