Homeహైదరాబాద్latest Newsఆడవారికి శృంగారం చేసే ఆసక్తి లేకపోతే ఏం చేస్తారో తెలుసా..?

ఆడవారికి శృంగారం చేసే ఆసక్తి లేకపోతే ఏం చేస్తారో తెలుసా..?

వైవాహిక జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగం. భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు జీవించాలి. సాధారణంగా పెళ్లయిన మహిళలు తమ భర్తల నుంచి ప్రేమను, ఆప్యాయతలను ఆశిస్తారు. రాత్రి మాత్రమే దగ్గరకు వచ్చే భర్తను ఏ భార్యా ఇష్టపడదు. సెక్స్ చేసినా వారికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. 35, 40 ఏళ్లు నిండిన వివాహితుల్లో చాలా మందికి సెక్స్‌పై కోరిక తగ్గుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఇష్టం లేని భార్యలు ఏం చేస్తారో తెలుసుకుందాం..

ఏదో ఒక సాకుతో ప్రతిరోజూ శృంగారాన్ని వాయిదా వేస్తూనే ఉంటారు. తలనొప్పి, కడుపునొప్పి వంటి కారణాలు చెబుతూనే ఉంటారు. నిద్ర, అలసట, పని ఉందని తప్పించుకుంటారు. సెక్స్ చేసిన తర్వాత జననాంగాలు నొప్పిగానూ, చికాకుగానూ ఉంటాయని కొన్ని కారణాలు చెబుతారు. వద్దు అని బాహాటంగా చెప్పకుండా ప్రతి రోజూ అయిష్టంగా గడిపేస్తుంటారు. ఏదో ఒక సమయంలో శృంగారం చేయక భర్తల ఆగ్రహానికి గురవుతారు.

భార్యపై ప్రేమ, ఆప్యాయతలు ఉండే భర్తకు కూడా తమ భార్యలకు సెక్స్ పట్ల ఆసక్తి లేదని తెలియగానే కోపం వస్తుంది. భర్తలు కోరుకున్నది లభించనప్పుడు, దూకుడుగా ఉంటారు. ఈ కారణంగా, మీ భర్తలు మిమ్మల్ని ద్వేషిస్తారు. మిమ్మల్ని ప్రేమించరు. ఆ తర్వాత మరో మార్గంలో సంబంధాన్ని కోరుకుంటారు.

శృంగారం ఆసక్తి లేని మహిళలు ఎక్కువగా హాల్‍లోకి వచ్చేస్తారు. లేదంటే వంటగదిలోకి వెళ్తారు. భర్త పక్కన పడుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భర్త ఎంత దగ్గరకు వచ్చినా అలసటగా ఉన్నట్టుగా ఉంటారు. మాట్లాడేందుకు ప్రయత్నించినా పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అందుకే భర్తలు సరిగా భార్యలను చూసుకుంటే ఈ సమస్యలు రావు.

ఈ విధంగా అయినప్పుడు మెుదట మీరు మాట్లాడి చూడండి. తర్వాత నిపుణులను సంప్రదించండి. వారి నుంచి సలహాలు తీసుకోండి. మీ సమస్య గురించి మీ భాగస్వామితో తప్పకుండా మాట్లాడాలి. తద్వారా వారు అర్థం చేసుకుంటారు. మీకు సహాయం చేస్తారు. దీన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. ధ్యానం, యోగా వంటి వ్యాయామాలలో పాల్గొనండి.

Recent

- Advertisment -spot_img