ఇదే నిజం, గూడూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐ.పి.ఎస్. అధ్వర్యంలో, గంగారం మండలంలోని జంగాలపల్లి గ్రామంలో, కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది పోలీసులు జంగాలపల్లి గ్రామాన్ని చుట్టుముట్టి, ప్రతి ఇంటిని అణువణువు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ఇద్దరిపై కేసుల నమోదు చేసి, దాదాపు 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 500 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ.. ప్రజలంతా గుడుంబా, గుట్కా, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాక మీ యొక్క, మీ పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలియజేశారు. గుడుంబా రహిత జిల్లాగా మహబూబాబాద్ ను తీర్చిదిద్దడంలో ప్రజలందరి భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలన్నారు. దీనిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది అన్నారు. దీనికి గ్రామ పెద్ద మనుషులు భాగస్వాములు కావాలని, రాజకీయ నాయకులు ముందుండాలని సూచిస్తూ అక్కడ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించినారు. ఇక మీద గుడుంబా తయారీ, అమ్మకం దారులు తమ పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జంగాలపల్లి యువతకు ప్రోత్సాహకరంగా వారికి ఆటల పట్ల శ్రద్ధ పెరిగేలా వాలీబాల్ కిట్టు బహుకరణ చేశారు. యువత గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారు చేసినట్లైతే వారి పేర్లను రహస్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, అట్టివారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఐపీఎస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు, ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీనివాస్ , గూడూరు సిఐ బాబురావు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య , గంగారం ఎస్సై రవి కుమార్, కొత్తగూడ ఎస్సై దిలీప్, గూడూరు ఎస్సై నగేష్ లతో ప పాటుగా పలువురు ఆర్ఐలు. ఆర్ ఎస్ ఐ లు, గూడూరు సర్కిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.