Homeహైదరాబాద్latest Newsఇన్‌స్టాగ్రామ్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన కోహ్లీ.. ఒక పోస్టుకే అన్ని మిలియన్ల..!

ఇన్‌స్టాగ్రామ్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన కోహ్లీ.. ఒక పోస్టుకే అన్ని మిలియన్ల..!

13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత, ప్రతి ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్‌లో ఓడి ట్రోఫీలను కోల్పోయింది. అయితే టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ రికార్డు సృష్టించింది. కప్‌తో, టీమ్‌తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్‌తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img