Homeహైదరాబాద్latest Newsకోడి చెరువును ఆక్రమనకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి.. వినతి పత్రం అందజేత

కోడి చెరువును ఆక్రమనకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి.. వినతి పత్రం అందజేత

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలోని కోడి చెరువు రైతులందరూ, స్థానిక తహసిల్దార్ కార్యాలయం పక్కనే 365 జాతీయ రహదారి వెంబడి ఉన్న కోడి చెరువు కింద. గూడూరు, బ్రాహ్మణపల్లి, ఏపూరు మచ్చర్ల గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. సుమారు 350 ఎకరాల భూమి, అట్టి చెరువుపై ఆధారపడి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో కొంతమంది రైతులు చెరువు మట్టి తీసి, శిఖం భూములలో పోసి చదును చేసి, చెరువును పూడ్చుతున్నారు. మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉండడంతో, శిఖం భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి, చెరువు విస్తీర్ణాన్ని కొల్లగొడుతున్నారు.

చెరువులో వ్యవసాయ బావులు తీసి, చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు. దీనివల్ల, అతి పెద్ద విస్తీర్ణం గల కోడి చెరువు క్రమంగా చిన్నకుంటల తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనితో చెరువులోని నీరుపై ఆధారపడి వ్యవసాయం చేసి, ఇప్పటికే! అప్పుల ఊపులో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరై జీవనం సాగిస్తున్న రైతన్నలందరూ, రోడ్డున పడి రోదించాల్సిన పరిస్థితులు ఉత్పన్న మౌతున్నాయని అనేకమార్లు గతంలో స్థానిక తహసిల్దారుగా విధులు నిర్వర్తించిన, మామిడి అశోక్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశామని, అదేవిధంగా మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఫిర్యాదు చేసి, కలెక్టర్ తో మాట్లాడించడం, తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. కానీ కోడి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు, శిఖం భూముల కొనుగోలు, ప్లాట్లుగా మార్చిన భూమిలో మట్టి తరలించి చదును చేయడం లాంటివి, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ తహసీల్దారుకు, అధికారులకు, ఫిర్యాదులు చేసిన ఫలితం మాత్రం శూన్యం. రెవెన్యూ అధికారులు ఇది మా పరిధిలోకిరాదని, ఐ బి, మైనింగ్, ఇరిగేషన్ పరిధిలోనికి వస్తుందని, వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అక్రమంగా తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకునే మాఫియాకు మాత్రం సహకరిస్తున్నారు. ఈ తరుణంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వినతి పత్రం అందజేసి,ఇప్పటికైనా కోడి చెరువు చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టి ఎల్) హద్దులను ఏర్పాటు చేయాలని, మట్టి మాఫియాపై, వారికి సహకరిస్తున్న అన్ని శాఖల అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను, కోడి చెరువు కింద సాగు చేసుకునే రైతులు అందరూ కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img