Homeహైదరాబాద్latest Newsలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరము

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరము

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్ యందు ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,గుంటుక ప్రకాష్ జిల్లా అడిషనల్ సెక్రటరీ ముఖ్యఅతిథిలుగా పాల్గొని కంటి చూపు మందగించిన వృద్ధులకు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని అలాగే లయన్స్ క్లబ్ ద్వారా డయాబెటిక్ శిబిరాలు,ఆరోగ్య శిబిరాలు,నేత్ర శిబిరాలు ఇలా ఏర్పాటు చేయడము చాలా గర్వకారణమని తెలిపారు.

ఈ శిబిరంలో 450 మంది రోగులు హాజరు కాగా డాక్టర్ వారిని పరీక్షించగా 220 మంది కంటి శుక్లాలు (మోతెబిందు) ఆపరేషన్ అవసరమున్నదని నిర్ధారించి వారిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న రేకుర్తి హాస్పిటల్ కు మొదటి విడతగా 43 మందిని ఆపరేషన్ కు ఉచిత రవాణా సౌకర్యంతో తీసుకు వెళ్లడం జరిగింది.మిగతా వారిని ఐదు(5) దఫాలుగా రేకుర్తి హాస్పిటల్ కు పంపించి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని,అలాగే ఈ సంవత్సరం వెయ్యి మందికి ఉచిత ఆపరేషన్లు నిర్వహించుటకు లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్టర్ ప్రెసిడెంట్ శ్రీరామల సుదర్శన్,పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్లగట్ట శంకర్ కోశాధికారి గుండేటి గంగాధర్,లయన్స్ క్లబ్ సభ్యులు దోపటి దేవదాస్ ద్యావనపల్లి అభిలాష్,ఆయిల్నేని వెంకటేశ్వరరావు,ఆనుమల్ల విలాస్,కట్ల శ్రీనివాస్,సామల శ్రీహరి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img