ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి నిన్నటి రోజున జగిత్యాల జిల్లా పర్యటనలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇష్టా రీతిగా మాట్లాడడం నీకు తగునా అని అన్నారు. మీరు పరిపాలన చేసిన పది సంవత్సరాలలో ఏ ఒక్క మంచి పని చేసినారు ప్రజలకు చెప్పాలి అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినారా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినారా, రైతుల వద్ద అధిక వడ్లు జోకుతున్నారు అని రైతులు మీ వద్దకు వస్తే కనీసం మిల్లర్లపైన చర్యలు తీసుకున్నారా, ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించి కాలేశ్వరం ప్రాజెక్టుకు పెట్టలేదా, కేటీఆర్, హరీష్ రావు పది సంవత్సరాలలో ఏమి చేసినారో ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అన్నారు. డబ్బులు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడు అని అంటున్నారు కదా మరి కవిత గారు జైలుకు ఎందుకు వెళ్లినట్టు, మన రాష్ట్ర పరువు తీసింది కవిత గారు కాదా అని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీరు మీ భార్య పెట్టిన ఎల్ఎం కొప్పుల ట్రస్టు ద్వారా నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినారో చెప్పగలరు ప్రజలను మభ్య పెట్టడానికి జాబ్ మేల అని పెట్టారు కానీ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. శ్వేత పత్రం విడుదల చేయాలని కోరినారు మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు గ్యారంటీలు అమలు చేసినాము మిగతా గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ ,వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సింహ రాజు ప్రసాద్ ,జక్కు రవీందర్ ,జంగిలి ప్రభాకర్, ఆయిల్ నేని కమలాకర్ రావు, దాసరి పురుషోత్తం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.