అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తొమ్మిది నెలలుగా కనిపించకపోయే సరికి ఓ తల్లి తల్లడిపోయింది. కొద్ది రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్ద తన గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే మాచవరం పోలీసులకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు స్నేహితుడు ట్రాప్ చేసి జమ్మూ తీసుకు వెళ్లినట్లు గుర్తించామని రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు పవన్ కు తెలియ జేశారు. దీంతో పోలీస్ యంత్రాంగం పనితీరును పవన్ అభినందించారు.