ఇదేనిజం, లక్షెట్టిపేట: ప్రజల బాగు కోసం అహర్నిశలు కృషి చేసే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రెమ్ సాగర్ రావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, అయన సతీమణి 14వ వార్డ్ కౌన్సిలర్ సువర్ణతో కలిసి తన ఇంటి నుండి దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడికి పాదయాత్ర చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రను పట్టణ అధ్యక్షుడు ఎండి అరిఫ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రెమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కూడా అనేక సేవలు అందించారని, త్వరలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలో ప్రెమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కాలని సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో నే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి కొక్కిరాల ప్రెమ్ సాగర్ రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన వెంట పాదయాత్రలో ఉత్తురి రవీందర్, రావుల రాజమౌళి, మాజీ ఎంపీటీసీ మడిపెళ్ళి స్వామి, సూరం చంద్రమౌళి, దేవా, రాజు, అమీర్, సోను, ప్రశాంత్, హాజీ, నర్సింమాచారి, శ్రీకర్, రాజేష్, జావిద్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.