ఇదే నిజం దేవరకొండ: పేదల ఆశాజ్యోతి, దేవరకొండ గిరిజన ముద్దుబిడ్డ, పేదల పెన్నిధి దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు చందంపేట మండలం పాత తెల్ దేవర పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని కర్మాన్ ఘాట్ ధ్యాన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే బాలు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మేడమోని మల్లేష్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియాగాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున కార్గే వారి దీవెనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి చేపట్టాలని వారు కోరారు. వారితో పాటు మేడారం రాములు, మేడమోని ఏడుకొండలు, కావటి శేఖర్, సండ్రగడ్డ జయరాం, నేనావత్ భరత్ కుమార్, గడ్డం శ్రీనివాస్, నేనావత్ శంకర్ లు ఉన్నారు.