Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ముందే చెప్పిన ‘ఇదేనిజం’

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ముందే చెప్పిన ‘ఇదేనిజం’

  • అర్ధరాత్రి రేవంత్, మున్షీ సమక్షంలో చేరిక
  • ముందే చెప్పిన ‘ఇదేనిజం’.. పేర్లతో సహా ప్రచురణ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. హస్తం గూటికి చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజు సారయ్య ఉన్నారు.

కాగా ఈ విషయం ఇదే నిజం దినపత్రిక ముందే చెప్పింది. ఎమ్మెల్సీలు పార్టీలు మారబోతున్నారని పేర్లతో సహా గురువారం సంచికలో ప్రచురించింది. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీలు పార్టీ మారడం గమనార్హం. వీరి చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కి పెరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతుండగా.. తాజాగా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బె చెప్పడం గమనార్హం. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.

Recent

- Advertisment -spot_img