నేడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ పుట్టినరోజు. 1981 జులై 7న రాంచీలో జన్మించిన ధోనీ తన కెరీర్‌లో భారత్‌కు ఎన్నో ట్రోఫీలు అందించాడు. ధోనీ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను లిఖించాడు. ముఖ్యంగా నాయకుడిగా ప్రపంచంలో ఏ కెప్టెన్‌కు దక్కిన విజయాలు సాధించాడు. ఇండియన్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన లెజెండ్ ధోనీ.
3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ తిరుగులేని రికార్డు :
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సాధించాడు. భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్ (2007), రెండో వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించాడు. ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌గా ధోనీ వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. అలాగే ధోనీ 148 క్యాచ్ అవుట్లు, 42 స్టంపింగ్‌లతో 190 మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చాడు.