Homeజిల్లా వార్తలుఎమ్మార్పీఎస్ టీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దేవరకొండ పట్టణంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ దేవరకొండ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో జండా ఎగరవేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్, రాష్ట్ర కార్యదర్శి పొట్ట మురళి హాజరై మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. అమరుల సాధన కోసం, వర్గీకరణ సాధించేంతవరకు విరామo ఎరుగని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత కంబాలపల్లి మాజీ సర్పంచ్ మద్దిమడుగు రవి,చందంపేట మండల అధ్యక్షులు అందుగుల సైదులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఏలేటి నరసింహ, పీఏపల్లి మండల అధ్యక్షులు రమనంపల్లి వెంకటయ్య, నేరేడు గమ్ము మండల అధ్యక్షులు కుక్కల మల్లయ్య,డిండి మండల సీనియర్ నాయకులు జట్టు మహేందర్ మాదిగ, డిండి మండల ఇన్చార్జ్ ఎలిమినేట్ ఈశ్వర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img