Homeహైదరాబాద్latest Newsగొర్రెల డీడీలు కట్టిన ప్రతి యాదవునికి లక్ష రూపాయలు చెల్లించాలి.. నూకల సురేందర్ యాదవ్ డిమాండ్

గొర్రెల డీడీలు కట్టిన ప్రతి యాదవునికి లక్ష రూపాయలు చెల్లించాలి.. నూకల సురేందర్ యాదవ్ డిమాండ్

ఇదే నిజం, గూడూరు: గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉండబడిన గొల్ల కురుమలకు, గొర్ల స్కీం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేలు చొప్పున మొదటి విడతలో అందించారు. తిరిగి రెండవ విడత స్కీమ్ అమలుకై గూడూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన, 128 మంది యాదవ బిడ్డలు డీడీలు జిల్లా కలెక్టర్ మహబూబాద్ వారి పేరు పై, ఒక్క డీడీకి 43,750 చొప్పున స్థానిక బ్యాంకులలో చెల్లించారు. ఇట్టి స్కీమును ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొర్ల స్కీమును కొనసాగించకపోగా, చెల్లించిన డీడీలను కనీసం సంవత్సరం పూర్తి కావస్తున్న ఇంతవరకు డీడీలు కట్టిన 43,750 రూపాయలు తిరిగి ఇవ్వనందున, ప్రతి ఒక్కొక్క యాదవ బిడ్డకు ఒక లక్ష రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ ద్వారా డీడీలు చెల్లించిన ప్రతి యాదవ బిడ్డకు ఇచ్చి ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని అఖిల భారత యాదవ మహాసభ మండల శాఖ అధ్యక్షుడు నూకల సురేందర్ యాదవ్ హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img