ప్రభాస్ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ ఏ దక్షిణాది చిత్రం సాధించని అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడింగ్ వర్గాలు అంచనా వేశాయి. బుక్ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ కల్కి రికార్డు సృష్టించింది.
‘కల్కి’కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా:
‘కల్కి’ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రస్తుతం రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక హిందీ ప్రేక్షకులు ఈ మూవీకి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో రూ.200 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూవీ ఇదే కావడం విశేషం.