Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (09-07-2024, మంగళవారం)

నేటి రాశి ఫలాలు (09-07-2024, మంగళవారం)

మేష రాశి
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని అందిస్తుంది. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు క‌లిసి వ‌చ్చే కాలం. పసుపు, తెలుపు రంగులు ధరించాలి. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వాళ్ళు ఈరోజు నూత‌న ప‌నులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల‌తో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన ఫ‌లితాలు అందుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నీలం, నేరేడు రంగుల దుస్తులు ధ‌రించండి. శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.

మిథున రాశి
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చరంగులు క‌లిసి వస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి.

క‌ర్కాట‌క రాశి
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమ‌వుతాయి. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం ఉంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు. ఆకుపచ్చ, తెలుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

సింహ రాశి
పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి ల‌భిస్తుంది. శ్రీమీనాక్షి స్తుతి పఠించండి.

కన్యా రాశి
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభ‌వార్త వింటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు ద‌ర్శిస్తారు. నిరుద్యోగులు ఆశాజ‌న‌క ఫ‌లితాలు ఉంటాయి. సోదరసోదరీమణులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆకుపచ్చ, తెలుపురంగులు క‌లిసి వ‌స్తాయి. శ్రీ శివాష్టకం పఠించండి.

తుల రాశి
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వ‌స్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. తెలుపు, చాక్లెట్ రంగులు శుభ‌ప్ర‌దం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి
అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు కొన్ని కేసుల నుంచి ఉపశమనం. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు రాశి
కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. గులాబీ, పసుపు రంగులు శివపంచాక్షరి పఠించండి.

మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితుల‌ను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఉద్యోగయత్నాలు సఫలం. నీలం, తెలుపు రంగులు, శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి.

మీన రాశి
ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆదరణ లభిస్తుంది. ఆకుపచ్చ రంగు, లేత గులాబీ రంగు, దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.

Recent

- Advertisment -spot_img