ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రెండు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రైతులందరికీ 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. రుణాల మాఫీపై మంత్రివర్గంతో సమావేశం నిర్వహించి.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. మరోవైపు.. రుణమాఫీ పథకం అమలు కోసం సూమారు 31 వేల కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా.. ఈ నిధుల సమీకరణ కూడా ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు