Homeహైదరాబాద్latest Newsఅయ్యో.. వృద్ధురాలికి లోన్ యాప్ వేధింపులు.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

అయ్యో.. వృద్ధురాలికి లోన్ యాప్ వేధింపులు.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలి ఇంటి ముందు ఉండే మహిళ లోన్‌యాప్‌ ద్వారా లోన్ తీసుకుంది. వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసింది. మహిళ జాడ తెలియక లోన్‌యాప్‌ నిర్వాహకులు ఆమె ఫోన్లోని కాంటాక్టు లిస్టులో ఉన్న వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు. రుణం కట్టించండి.. లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమేకాదు అసభ్యంగా మాట్లాడారు. ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి కేసులు రోజుకు పదుల్లో వస్తున్నాయి.. ఏమీ చేయలేమని పోలీసులుచేతులెత్తేశారు. చివరకు వృద్ధురాలు ఫోన్ నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది.

Recent

- Advertisment -spot_img