Homeహైదరాబాద్latest Newsకొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ సీజ్

కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ సీజ్

ఇదే నిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో గల విజేత సూపర్ మార్కెట్ ను గురువారం జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. రాఘవేంద్ర కాలనీలోని హై టెన్షన్ రహదారికి ఆనుకొని ఉన్న విజేత సూపర్ మార్కెట్ అక్రమ నిర్మాణమని, సదరు నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గురువారం శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ ను మూసి వేయించి సదురు భవనాన్ని సీజ్ చేశారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ హై టెన్షన్ రహదారిపై ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణం అంటూ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించాడు. కుమార్ యాదవ్ ఫిర్యాదు పై స్పందించిన కోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించింది. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిఈ విశాలాక్షి ఆధ్వర్యంలో గురువారం విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు.

Recent

- Advertisment -spot_img