Homeహైదరాబాద్latest Newsరాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు.. మత్తు పదార్థాలు అమ్మితే అరెస్ట్.. లక్షెట్టిపేట సీఐ...

రాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు.. మత్తు పదార్థాలు అమ్మితే అరెస్ట్.. లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ హెచ్చరిక..!

ఇదేనిజం, లక్షెట్టిపేట: ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడతామని, ప్రతి వార్డులో, ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మత్తు పదార్థాలు అమ్మినా, వాడిన అరెస్ట్ చేస్తామని లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డులోని వీకర్ సేక్షన్ కాలనిలో పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30బైకులు, 2ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చెపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు వాహనాల పత్రాలను వాహనంతోపాటు ఉంచుకోవాలన్నారు. రాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్మితే చాలా పెద్ద నేరమని వాటి జోలికి పోయి కేసుల్లో ఇరుక్కోకుడదని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోచంపల్లి సతీష్, రెండో ఎస్సై తానాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img