Homeహైదరాబాద్latest Newsకేసీఆర్‌ను త్వరలో జైలుకు పంపుతాం..అదే మా లక్ష్యం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ను త్వరలో జైలుకు పంపుతాం..అదే మా లక్ష్యం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయం
  • హరీశ్‌రావు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ
  • జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను త్వరలోనే జైలుకు పంపించడమే తన లక్ష్యమన్నారు. కొద్దిరోజుల్లో ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా అతి త్వరలో బీజేపీలోకి వెళ్తారన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జైలుకు వెళ్లే నేతలను తాము కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకోము అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోమని, ఆయన జైలుకు వెళ్లే వ్యక్తని, జైలుకు వెళ్లే వారిని తాము కాంగ్రెస్‌లో చేర్చుకోమని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని, బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ అని అందుకే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌‌లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతీ ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందన్నారు.

Recent

- Advertisment -spot_img