వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలగకుండా ఆస్ట్రేలియా కొత్త ఇండోర్ స్టేడియాన్ని రూపొందిస్తోంది. టాస్మానియాలో స్టీల్, టింబర్ మిశ్రమాలతో రూఫ్ నిర్మించనున్నారు. దీని వల్ల ఒక్క చుక్క నీరు కూడా కింద పడదు. ఎండ, సహజ కాంతి స్టేడియంలోకి పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 23వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియాన్ని 2028లో అందుబాటులోకి తెచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.