తెలంగాణ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికం చేసింది ప్రభుత్వం. అయితే ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరు రుణం తీసుకుంటే కుటుంబ పెద్దకే రుణమాఫీకి అర్హత ఉంటుంది. రూ.2 లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించాలి. తొలిగా మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఎన్ఐసీ నుంచి సేకరించిన సమాచారంతో క్రోడీకరించి అర్హులను ఫైనల్ చేస్తారు.
రుణమాఫీ వారికీ వర్తించదా..?
ఈ క్రమంలోనే ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రైతులకు సమస్యలు ఉంటే 30రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్‌ను చూడవచ్చు.