Homeహైదరాబాద్latest Newsహరితహారం మొక్కలకు రక్షణఏది..? మొక్కల సంరక్షణ పై అధికారులు నిర్లక్ష్యం..!

హరితహారం మొక్కలకు రక్షణఏది..? మొక్కల సంరక్షణ పై అధికారులు నిర్లక్ష్యం..!

ఇదేనిజం, కంగ్టి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు కానీ ఇప్పుడు వాటికీ రక్షణ కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. వివరలోకి వెళ్ళితే కంగ్టి మండల కేంద్రం నుండి దెగుల్వాడి వైపు వెళ్లే, రోడ్డుకు ఇరువైపుల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హరితహారం లో భాగంగా రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. కానీ ఇప్పుడు వాటికి ఆ రక్షణ లేకుండా పోయింది. గత ప్రభుత్వం లో వాటికీ అన్ని విధాల రక్షణ ఏర్పాటు చేశారు.

కానీ ఇప్పుడు ఆ మొక్కలకు రక్షణ చేయకపోవడంతో, పశువులు మొక్కలను తింటున్నాయని మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు విపరీతంగా గడ్డి పెరిగిపోవడంతో హరితహరంలో నాటిన మొక్కలకు సరైన రక్షణ లేక అక్కడ పెరగలేక పిచ్చి మొక్కలలోకలిసి పోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరితహారం పట్ల మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల, హరితహారం మొక్కల పై గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రజలు అధికారుల పై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి హరితహారం మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img