Homeహైదరాబాద్latest NewsBREAKING: మూడు విడతల్లో రుణమాఫీ.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

BREAKING: మూడు విడతల్లో రుణమాఫీ.. కీలక విషయాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని వివరించారు.

కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా రూ. 28 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం గడువు లోపే ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. రుణమాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లినట్టుగా రుణ మాఫీ చేశామని గ్రామాల్లో చెప్పాలని ఆదేశించారు.

వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించే విధంగా ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అని చెప్పారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం లాంటిదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాట నెరవేరుతుందనే నమ్మకం ప్రజల్లో తమ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img