తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆగస్టు నెల దాటకముందే రుణమాఫీ కింద రూ.31వేల కోట్ల నిధులను విడుదల చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 11 లక్షలకు పైగా రైతులకు రూ.6వేల కోట్లు విడుదల చేస్తున్నామని భట్టి తెలిపారు.