Homeహైదరాబాద్latest Newsఅందరూ అనుకున్నట్లే జరిగింది.. హార్దిక్ పాండ్యా, నటాషా డైవర్స్.. కుమారుడిపై హార్దిక్ ఎమోషనల్ పోస్ట్..!

అందరూ అనుకున్నట్లే జరిగింది.. హార్దిక్ పాండ్యా, నటాషా డైవర్స్.. కుమారుడిపై హార్దిక్ ఎమోషనల్ పోస్ట్..!

ఇదేనిజం, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్‌ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. నటాషా కుమారుడు అగస్త్యను తీసుకొని ఇటీవల ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ‘4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం కలిసి ఉండేందుకు మా వంతుగా అన్ని విధాలుగా ప్రయత్నించాం. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మా అనుబంధాన్ని తెంచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఇది మాకు చాలా కఠిన నిర్ణయం. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. పరస్పరం గౌరవించుకున్నాం. ఆనందాన్ని పంచుకున్నాం. కుటుంబాన్ని పెంచుకున్నాం. అగస్త్య రాకతో మా జీవితంలో ఆనందం రెట్టింపయ్యింది. అతడి సంతోషం కోసం మేం చేయగలిగినదంతా చేస్తాం’ అంటూ తమ విడాకుల ప్రకటనలో నటాషా, పాండ్యా రాసుకొచ్చారు. ఈ కష్టమైన, సున్నితమైన సమయంలో తమకు మద్దతుగా ఉండాలని, తమ వ్యక్తిగత జీవితం గోప్యతను గౌరవించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img