ఇదేనిజం, లక్షెట్టిపేట: లక్షెట్టిపేటలో శుక్రవారం గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని బోయవాడ, మహాలక్ష్మి వాడ, గోదావరిరోడ్, వార్డుల నుంచి గంగపుత్ర సంఘం మహిళల ఆధ్వర్యంలో ఇంటికో బోనం నెత్తిన ఎత్తుకుని ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన మహిళలు గోదావరి వద్ద ఉన్న గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు.