ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం సాదరంగా స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ముఖ్య అర్చకులు రమణయ్య , అర్చకులు నంభి నరసింహ మూర్తి మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.