Homeజిల్లా వార్తలుచదివిన పాఠశాలకు మైక్ సెట్ బహూకరించిన పూర్వ విద్యార్థినీలు

చదివిన పాఠశాలకు మైక్ సెట్ బహూకరించిన పూర్వ విద్యార్థినీలు

దే నిజం, దేవరకొండ: దేవరకొండ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో శనివారం రోజు అదే పాఠశాలలో చదివిన 1997-1998 పదవ తరగతి పూర్వ విద్యార్థినిలు పాఠశాలకు ఏ సి డి సి మైక్ సెట్, మరియు గోడ గడియారం లను పాఠశాల హెడ్మాస్టర్ రేబాక మేడం మరియు ఉపాధ్యాయులకు బహూకరించారు.. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని గంజియాదేశ్వరి మాట్లాడుతూ.. ఇటీవలే దేవరకొండ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 97- 98 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ ముప్పై మంది విద్యార్థినులు, మరియు పూర్వ ఉపాధ్యాయులతొ కలిసి చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగానిర్వహించుకున్నామని, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తమ వద్ద మిగిలిన డబ్బులతో పాఠశాలకు అవసరమయ్యే మైక్ సెట్, గోడ గడియారం లను బహుకరించామని అన్నారు. చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేసి రుణం తీర్చుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని అలాగే అందరూ తమ తమ పాఠశాలలకు సహాయం చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హెడ్మాస్టర్ రేబాక, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయిరాళ్లు గంజియాదేశ్వరి, ముసిని ధనలక్ష్మి, ముసిని అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img