- రూ. 9.26 కోట్లతో మోటార్లు, గేట్లు మరమ్మత్తులు
- ప్రభుత్వాన్ని ఒప్పించిన మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు
- అందుబాటులోకి కడెం ప్రాజెక్టు
- నేడు కడెం కాల్వలకు నీటి విడుదల
- డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్
- గురునానక్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్
ఇదేనిజం, లక్షెట్టిపేట: గత బీఆర్ఎస్ పాలనలో కడెం ప్రాజెక్టు తీవ్ర నిర్లక్షనికి గురయ్యిందని, అయినా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రభుత్వం ను ఒప్పించి రూ. 9.26 కోట్ల నిధులు మంజూరు చేయించి, మోటార్లు, గేట్లు, ఇతర మరమ్మత్తులు చేయించి వానాకాలం పంటకు ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చామని డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత రెండేళ్ళుగా వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదని, ప్రాజెక్ట్ పరిస్థితిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు రాష్ట్ర ప్రభుత్వంను ఒప్పించి రూ.9.26 కోట్ల నిధులు విడుదల చేయించారన్నారు.
దీంతో వరద గేట్లను, మోటార్లను, ఇతర నూతన విడి భాగాలను అమర్చారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు సిద్ధం అయిందని, ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లో వరద నీరు చేరుతుందన్నారు. నీటి మట్టం పెరగడంతో రేపు నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు మరమ్మతుల కు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రెమ్ సాగర రావుకు మంచిర్యాల నియోజకవర్గ రైతుల తరుపున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ధన్యవాదాలు తెలియ జెస్తున్నామన్నారు. గత రెండు సీజన్ లలో రైతులకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షుడు రాందెని వెంకటేష్, కొ ఆప్షన్స్ సయ్యద్ అలీ, కాంగ్రెస్ నాయకులు నలిమెలి సత్తయ్య, అన్నం చిన్నన్న, ఉత్తురి రవీందర్, గుండ శ్రీనివాస్, రంజీత్ సింగ్, బోడ రాజు, నల్లపు పోచన్న, సందెల సురేష్, బుద్దె తిరుపతి, ఆజీ, నవీన్, వీందర్, రాజమౌళి, తిరుపతి, నాగ, రాకేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.