Homeజిల్లా వార్తలుతండ్రి మరణం పై పాట చిత్రీకరణ.. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్...

తండ్రి మరణం పై పాట చిత్రీకరణ.. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా విడుదల..!

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రములోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా తండ్రి మరణం పై పాట చిత్రీకరణ యూట్యూబ్లోకి విడుదల చేయడం జరిగింది. ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వెనేంక శ్రీనివాస్ తండ్రి వెనేంక శంకరయ్య (65) ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణించడం జరిగింది.దీనితో శ్రీనివాస్ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు,తన భవిష్యత్ కార్యాచరణలో ప్రధాన పాత్ర పోషించిన తండ్రి శంకరయ్య జ్ఞాపకాలతో ముత్తునూర్ గ్రామంలో ఓ పాట చిత్రీకరణ రూపొందించడం జరిగింది.ఈ సందర్భంగా వెనేంక శ్రీనివాస్ మాట్లాడుతూ…. నిజ జీవితంలో తండ్రిని కోల్పోయిన బాధను,అతను చిన్నప్పటి నుండి వెన్నంటి నడిపించిన తీపి జ్ఞాపకాలను ప్రజలందరితో పంచుకోవాలని ఉద్దేశంతో తన తండ్రి మరణాన్ని ఎలాగైనా ఒక రూపాన్ని సృష్టించాలనే దృఢ సంకల్పంతో ఈ పాటను చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు.ఆ పట్టుదలతోనే ‘నాన్న వెళ్ళిపోయావా’ అనే పాటను రూపొందించినట్టు తెలిపారు.ఈ పాట విడుదల కార్యక్రమంలో గొల్లపల్లి తాజా మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, వెనేంక శ్రీనివాస్,ఉప్పు రమేష్, సింగతి వెంకటస్వామి,మన్నె జితేందర్,రాజు,సంతోష్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img