ఇదేనిజం ,శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని హెచ్ సీయు టెలిఫోన్ క్వార్టర్స్ లోని రేణుకఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.