ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని శ్రీ సాయి పి పి ఆర్ ఫంక్షన్ హాల్ ఆదివారం నాడు ఏర్పాటు చేసిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ రామవత్ చందు లాల్ నాయక్ ఉద్యోగ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నేనావాతు బాలు నాయక్ హాజరై, రామవత్ చందు లాల్ నాయక్ కి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపి, వారి సేవలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ శిరాజ్ ఖాన్, నాయిని మాధవ రెడ్డి,ఎంపీపీ భవాని పవన్ కుమార్, పార్టి అధ్యక్షులు నాగభూషణం, బాధ్య నాయక్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,కో ఆప్షన్ సభ్యులు సదిక్, ఎంఈఓ మాతృ, రామకృష్ణ రెడ్డి,ఉద్యోగ ఉపాధ్యాయ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు